Header Banner

వైసీపీ ఫేక్ పార్టీ... అసత్య ప్రచారాలను మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవు! చంద్రబాబు గట్టి హెచ్చరిక!

  Mon Apr 14, 2025 22:08        Politics

తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికైనా పదవులు, బాధ్యతలు దక్కాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల ఆమోదం తప్పనిసరి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల మన్ననలు పొందని నేతలకు పార్టీలో స్థానం ఉండదని తేల్చిచెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారికే సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా, కార్యకర్తలకు దూరంగా ఉండే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే, నాయకుడు తమ సొంత బూత్‌లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలని, అప్పుడే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు అవగతమవుతాయని సూచించారు. కుప్పంలో తాను కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తానని ఉదహరించారు.

సొంత మీడియా ఉందని...!
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "వైసీపీ ఓ ఫేక్ పార్టీ" అని వ్యాఖ్యానించిన ఆయన, వివేకానందరెడ్డి హత్య కేసును తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, ఆ ఘటనపైనా ప్రభుత్వంపై బురద జల్లారని అన్నారు. సొంత మీడియా ఉందని తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బూతు రాజకీయాలకు స్వస్తి పలికేందుకే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. లిక్కర్, ఇసుక వంటి విధానాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ఎలాంటి మొహమాటాలకు తావుండదని తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #YCPFakeParty #PoliticalWarning #AndhraPolitics #TDPVsYCP